–ప్రగతి నగర్ పక్కన ఉన్న మిథాలీ నగర్ 307 లో ఏడదిగా అక్రమ కట్టడాలు..
–ప్రజా ఎన్ కౌంటర్ వరుస కథనాలకు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులతో శుక్రవారం ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ పరిశీలన…
–కొత్తగా బేస్మెంట్లు గుర్తించిన ఆర్డిఓ.. వెంటనే కూల్చివేయాలని తహసిల్దార్ కి ఆదేశం..!
కుత్బుల్లాపూర్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 31: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ రెవెన్యూ పరిధి ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నట్టు ప్రజా ఎన్ కౌంటర్ దినపత్రికలో వరుస కథనాలకు స్పందించిన రెవెన్యూ జిల్లా అధికారి శ్యామ్ ప్రకాష్, శుక్రవారం జనవరి 31 కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులతో కలిసి ప్రగతి నగర్ కి ఆనుకొని ఉన్న మిథిలా నగర్ సర్వేనెంబర్ 307 లో ప్రభుత్వ భూమిలో పరిశీలన చేయడం జరిగింది, వాస్తవంగా కబ్జాలు జరుగుతున్నట్టు గుర్తించిన ఆర్డిఓ తదుపరి చర్యలపై అధికారులతో చర్చించారు, స్థానిక అధికారులను ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అడిగి తెలుసుకోవడం జరిగింది, ఇప్పటికి చాలా కబ్జాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు, వీటిపై వెంటనే మండల అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన ఆర్డిఓ, దానికి వారి సమాధానం 307/ఏ పేరుతో కోర్ట్ ఆర్డర్లో ఉంది అందుకే చర్యలు తీసుకోలేకపోతున్నాం అని ఆర్డీవో కి బదులిచ్చిన మండల అధికారులు.
–నిర్లక్ష్యం చేయకుండా స్టే వెకెట్ చేయించి.. కూల్చివేయాలి…!! ఆర్డీవో శ్యామ్ ప్రకాష్
గాజులరామారం పరది సర్వేనెంబర్ 307 మిథిలా నగర్ ప్రభుత్వ భూములు కబ్జాదారుడు 307/ఎ పేరుతో కోర్ట్ ఆర్డర్ ఉందని యదేచ్ఛగా కబ్జాలకు పాల్పడడం పై ప్రజా ఎన్ కౌంటర్ దినపత్రిక, పీపుల్స్ న్యూస్ దినపత్రిక లో వరుస కథనాలు రావడంతో మల్కాజ్గిరి ఆర్డిఓ శ్యామ్ ప్రకాష్ సంబంధిత కబ్జాలను శుక్రవారం పరిశీలించారు, కొత్తగా మరికొన్ని బేస్మెంట్లు నిర్మించినట్లు ఆర్డిఓ గుర్తించారు తక్షణమే బేస్మెంట్లను కూల్చివేయాలని స్టే వెకెట్ చేయించి నిర్మాణాలు కూడా కుల్చివేయాలని తహసిల్దార్ కు ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ ఆదేశించారు.