–రెండు అనుమతులు తీసుకొని ఒకటే నిర్మాణం చేపడుతున్న నిద్ర అవస్థలో అధికారులు…!!–టిపిఎస్ సంజన అవినీతికి పాల్పడుతున్నట్టు అనేక ఆరోపణలు…!–టీఎస్ బిపాస్ నిబంధనలను పట్టించుకోని కమిషనర్..!!–కమిషన్లు తేవడంలో వసుల్ల రాజాగా చైన్ మెన్ లు..?
దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ బ్యూరో: దుండిగల్ మున్సిపాలిటీ కేంద్రం ఏ విభాగం చూసినా అవినీతికే ముందు ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు, స్థానికంగా జరుగుతున్న పనులు, అక్రమ నిర్మాణాలను బట్టి స్థానిక ప్రజలు అపోహ వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా పట్టణ ప్రణాళిక అధికారులు పూర్తిగా అవినీతి పాల్పడుతున్నట్టుగా అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి, టి ఎస్ బి పాస్ పరిధిలో అనుమతులు ఒక్కోలా నిర్మాణం మరోలా చేపడుతున్న నిమ్మకు నీరెత్తినట్టుగా స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడంపై టౌన్ ప్లానింగ్ విభాగం పై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుంది. తాజాగా మల్లంపేటలో సర్వేనెంబర్ 101, 102, 103, 104, 105/p, మరియు 106/p ఈ సర్వే నెంబర్లు ప్లాట్ నెంబర్ 40 మరియు 41/పార్ట్ దాదాపు 180 గజాలలో అలాగే ఇంకో 236 గజాలలో అదే సర్వే నంబర్ ప్లాట్ నెంబర్ 41/పార్ట్ , ఈ రెండు ప్లాట్లకు S+2(382563/DUND/0264/2024) (382557/DUND/0263/2024) రెండు అనుమతులు విడివిడిగా S+2 మాత్రమే అనుమతులు తీసుకొని ఏదేచ్ఛగా ఒకటే నిర్మాణం చేపడుతున్న అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి అని స్థానికుల ఆరోపణ చేస్తున్నారు, జిహెచ్ఎంసి ఆక్ట్ 1956 జీవో చాప్టర్ 12 సెక్షన్ 461 ప్రకారం ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం అని GO లొ స్పష్టంగా పేర్కొనడం జరిగింది, కానీ నిబంధనాలను తుంగలో తొక్కుతూ ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న..!! అవినీతి అధికారులు. ఇప్పటికైనా ఆక్రమ్ నిర్మాణం పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని లేని ఎడల CDMA శాఖలో ఫిర్యాదులు వెళ్తాయని ఈ సందర్భంగా స్థానికులు హెచ్చరించారు