మియాపూర్, మే 09, (ప్రజా ఎన్కౌంటర్ ) : ఓ మైనర్ బాలుడు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒల్డ్ హఫీజ్ పేట సాయినగర్కు చెందిన యండి.అశ్రఫ్ కుమారుడు యండి.అసద్ ఆహ్మాద్ (11) బుధవారం మదిన గూడ మదర్స్ నుంచి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. కుమారుడి ఆచూకి కోసం చుట్టూ పక్కల ఎక్కడ వెతికిన కనిపించలేదు. దీంతో మియాపూర్ పోలీసులను ఆశ్రయించిన యండి.అశ్రఫ్ ఫిర్యదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
