మేడ్చల్ జిల్లా దుండిగల్ నియోజకవర్గం స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ, స్పెషల్ ఆఫీసర్ వి సాయినాథ్, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల నందు పారిశుద్ధ్య పనులను పరిశీలించినారు, రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు లేకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, కాళీ ప్రదేశాలలో గార్బేజి ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, సూచించినారు, అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా కిరాణాషాపులు హోటల్స్, రెస్టారెంట్లు లలో సింగిల్ యూస్ ప్లాస్టిక్, 120 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను వాడవద్దని, వివరించినారు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, దుందిగల్ మున్సిపల్ పరిధిలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసారు, ముఖ్యంగా సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడే, కిరాణా షాపులు, హోటల్స్ , చికెన్ మటన్ దుకాణాలపై రైడ్ చేసి సింగల్ యూస్ ప్లాస్టిక్ అమ్మేవారికి పెనాల్టీ విధించడం జరుగుతుంది, అదేవిధంగా ప్లాస్టిక్ బదులు అందరూ జూటు బ్యాగులు చేతి కర్ర సంచులు వాడాలని సూచించినారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్ నాయక్ , మున్సిపల్ ఇంజనీర్ బి సురేందర్ నాయక్, సానిటరీ ఇన్స్పెక్టర్ కే అంజయ్య,రామచందర్ ,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పి సాత్విక్, వార్డ్ ఆఫీసర్లు, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
