పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల తీన్మార్ మల్లన్న టీం జోగులంబ గద్వాల జిల్లా అధ్యక్షులు కొమ్ముల ప్రవీణ్ రాజ్ అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి ఇలాంటి అవార్డులు మరి ఎక్కువగా గెలుచుకోవాలని కోరుకుంటున్నానని.అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు కొమ్ముల ప్రవీణ్ రాజ్ అభినందనలు తెలియజేశారు. 2024 లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు కొమ్ముల ప్రవీణ్ రాజ్ అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను ముఖ్యంగా బాలికలను స్పోర్ట్స్ వైపు మళ్ళించే విధంగా ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ కు సపరేట్ సమయం కేటాయించి పిల్లలను ప్రోత్సహించాలని కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.
సావిత్రిబాయి పూలే జయంతినీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి,రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు:-కొమ్ముల ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు
సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కొమ్ముల ప్రవీణ్ రాజ్.
