హన్మకొండ: భువనగిరిలో జూలై 5న జరిగే “రాజ్యాధికార సమరభేరి” సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో జరిగిన జనగామ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా నుంచి కనీసం 10 వేల మందిని సభకు తరలించే లక్ష్యంతో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు అంశాలపై సమావేశంలో చర్చించారు.
జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలి
