బ్రేకింగ్ న్యూస్
ఫ్లాష్ న్యూస్ 💥🔥జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలిజులై 5 ‘సమరభేరి’ విజయవంతానికి కరీంనగర్‌లో సన్నాహక సమావేశంరాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలుఅమరవీరుల స్థూపానికి అధికారుల నిర్లక్ష్యంసీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంభూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలుజోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..ఫ్లాష్ న్యూస్ 💥🔥జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలిజులై 5 ‘సమరభేరి’ విజయవంతానికి కరీంనగర్‌లో సన్నాహక సమావేశంరాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలుఅమరవీరుల స్థూపానికి అధికారుల నిర్లక్ష్యంసీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంభూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలుజోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..
తెలంగాణ

రాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలు

రాపిడో డ్రైవర్ చొరవతో గంజాయి ముఠా బట్టబయలు

పార్శిల్‌పై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించిన డ్రైవర్

డ్రగ్ పెడలర్ అరెస్ట్.. కిలో గంజాయి స్వాధీనం

దుండిగల్, జూన్ 3: రాపిడో డ్రైవర్ అప్రమత్తతతో గంజాయి సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మే 31న మేడ్చల్ నుంచి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్శిల్ బుక్ చేయగా, ఆ పార్శిల్‌ను తీసుకెళ్తున్న రాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్‌కు అనుమానం కలిగింది. వెంటనే ఆయన దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు.

డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి, ఒక డ్రగ్ కన్జ్యూమర్‌తో పాటు ఓ డ్రగ్ పెడలర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెడలర్ వద్ద నుంచి సుమారు ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని, దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించిన రాపిడో డ్రైవర్ సత్తు ఆదర్శ్‌ను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ అభినందించి, శాలువాతో సత్కరించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.