Breaking News

కాంగ్రెస్ 6 మోసాలు 66 అబద్ధాలపై నేడు బీజేపీ భారీ బైక్ ర్యాలీ,కార్నర్ మీటింగ్..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన గత ఎన్నికల్లో 6 గ్యారంటీల మాటున ఇచ్చిన 420 అబద్దపు హామీల వైఫల్యాలపై 6 మోసాలు 66 అబద్ధాల పేరిట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గురువారం వనపర్తిలో నియోజకవర్గ స్థాయి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని,మొదటగా 7 మండలాలు పెబ్బేరు మున్సిపాలిటీ వారి మండలాలలో మండల పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఆయా మండలాలలోని గ్రామాలను కలుపుతూ మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటుందని జిల్లా కేంద్రానికి సంబంధించిన బైక్ ర్యాలీతో కలిసి సాయంత్రం ఐదు గంటలకు మున్సిపల్ పురవీధుల గుండా చైతన్య రథం, మైక్ సౌండ్ సిస్టంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ సాయంత్రం 6 గంటలకు రాజీవ్ చౌరస్తాకు చేరుకొని అక్కడ జరిగే కార్నర్ మీటింగ్ తో ముగుస్తుందని జిల్లా అధ్యక్షుడు డి నారాయణ జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ పెద్దిరాజులు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జరిగే ఈ భారీ బైక్ ర్యాలీ మరియు కార్నర్ మీటింగుకు ముఖ్య అతిథులుగా జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాజీ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు పాల్గొననున్నారని నియోజకవర్గంలోని రాష్ట్ర జిల్లా మరియు మండల బూత్ కమిటీ నాయకులు తప్పనిసరిగా పాల్గొని బైక్ ర్యాలీ కార్నర్ మీటింగ్ విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డి నారాయణ జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్చార్జి పెద్దిరాజు పేర్కొన్నారు.

జూలై 5 సమరభేరి సభను విజయవంతం చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *